అమెరికా రక్షణ శాఖ మంత్రి జిమ్ మ్యాటిస్ రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి జిమ్ మ్యాటిస్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ట్రంప్ సిరియా నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే మ్యాటిస్ తన రాజీనామాను ప్రకటించారు. ట్రంప్‌తో చర్చలు జరిపిన తరువాతనే మ్యాటిస్ తన రాజీనామాను ప్రకటించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు పదేపదే తన ఆలోచన విధానాలను, మంత్రివర్గంలో మార్పులు చేస్తుండటంతో విభేదాలు తలెత్తినట్లు మ్యాటిస్ సంబంధికులు పేర్కొంటున్నారు. మ్యాటిస్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో విభేదాలు రావడంతోనే రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను వైట్‌హౌస్ వర్గాలు ఖండిచాయి. ఇది మాటిస్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, ఎవరి బలవంతం లేదని సృష్టం చేశాయి.













