హైదరాబాద్ చరిత్రపై ఇవాంకా ఆసక్తి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చరిత్రను తెలుసుకునేందుకు పారిశ్రామికవేత్తలతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. వచ్చే నెల 28 నుంచి 30వ తేదీల మధ్య హెచ్ఐసిసిలో జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్(జిఇఎస్)లో జరిగే పీన్లరీ సదస్సులో ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆమె కూడా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కల్చర్ గురించి ఆమె సదస్సుకు వచ్చే ప్రతినిధుల, స్థానిక ప్రజలతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతారని హైదరాబాద్లోని అమెరికా కాన్సూలేట్ జనరల్, డిప్యూటి కాన్సూల్ జనరల్ డొనాల్డ్ ఎఫ్.మలిగాన్ చెప్పారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో వారిని భాగస్వామ్యం చేసే విధంగా ‘ఉమెన్ ఫస్ట్, ప్రాస్పర్టి ఫర్ ఆల్’ నినాదంపై ప్రత్యేక చర్చాగోష్టులు నిర్వహించనున్నారు. ఈ చర్చావేదికలో ఇవాంకా పాల్గొంటారని, ఇందుకు తగ్గట్లు గా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు డొనాల్డ్ తెలిపారు.













