టాంపాలో ఐటీ సర్వ్ శాఖ
టాంపాలో ఐటీ సర్వ్శాఖను ఇటీవల ప్రారంభించారు. వివిధ నగరాల్లో తన శాఖలను విస్తరిస్తున్న ఐటీ సర్వ్ ఇప్పుడు టాంపాలో 12వ శాఖను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఐటీ సర్వ్ అధ్యక్షుడు కందుకూరి గోపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐటీ సర్వ్ టాంపా చాప్టర్ అధ్యక్షుడిగా రాంప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటీ సర్వ్ కార్యనిర్వాహకులు ఉప్పు వినోద్ బాబు, ఖండవల్లి కిషోర్, కిలారు అనిల్, రాహుల్ రెడ్డి,పెన్నం సుధాకర్, కిలారు సందీప్, దేవేందర్ రెడ్డి , కిలారు శ్రీధర్, టీ.ప్రవీణ్, ఆళ్ళ రాధాకష్ణ, చనుమోలు వినోజ్, నేమాని బాలా తదితరులు పాల్గొన్నారు.













