అమెరికా గూఢాచారికి త్వరలో ఉరిశిక్ష
ఇరాన్ ఖుడ్స్ పోర్స్ అధినేత ఖాసీం సోలేమనిని టార్గెట్ చేయడంలో అమెరికాకు సమాచారం ఇచ్చిన గూఢాచారిని ఉరితీసేందుకు రంగం సిద్ధమైనట్టు ఆ దేశ న్యాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సుప్రీంకోర్టు కూడా సమర్ధించినట్టు తెలిపాయి. ఇరాన్ భద్రతా బలగాలపై గూఢచర్యం చేసిన ఘటనలో మహ్మద్ మౌసావి మజ్ద్ను అనే వ్యక్తిని దోషిగా తేల్చారు. దీనికి సంబంధించిన ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి గోలం హోస్సేస్ ఇస్మాయిలి టెలివైజెడ్ న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రధానంగా సోలేమని ఎక్కడ ఉన్నారు. ఆయన కదలికలపై మహ్మద్ అమెరికా, ఇజ్రాయిల్లకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఇందుకు గానూ ఆ దేశాలను నుంచి ఆయనకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు తెలిపారు. మహ్మద్ మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్ధించిందని, దీన్ని త్వరలో అమలు చేసేందుకు సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.













