జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాలకు కేంద్రమంత్రి పెమ్మసాని కి ఆహ్వానం
వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాలకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం ఆహ్వానించారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావుతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆహ్వానపత్రికను అందజేశారు. సెప్టెంబర్ 27,28 తేదీల్లో జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా కోరారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. దేశంలో ఉన్న ఎన్నారైల ఆస్తులకు రక్షణ కల్పించాలని, అవి అన్యాక్రాంతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో వారి ఆస్తులకు రక్షణ కరువైందన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని పెమ్మసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సామినేని కోటేశ్వరరావు, గోరంట్ల పున్నయ్య చౌదరి, ఘంటా పున్నారావు, వడ్లమూడి నాగేంద్రం, రాయపాటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







