మహిళలకు అమెరికా స్కాలర్షిప్పులు
అమెరికాలోని అంతర్జాతీయ విద్యాసంస్థ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు స్కాలర్షిప్పులు సహా మెంటారింగ్(దిశానిర్దేశ) ప్రోగ్రాంను ప్రకటించాయి. భారత్లో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళలు మరింతగా రాణించేందుకు ‘ఉయ్టెక్ గోల్డ్మన్ సాచ్స్ స్కాలర్స్’ పేరుతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ), గోల్డ్మన్ సాచ్స్ సంస్థలు ఈ స్కాలర్షిప్పులను ఇవ్వనున్నాయి. 2017-18 విద్యాసంవత్సరానికి గాను విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న మొత్తం 25 మంది భారత మహిళలకు రూ. 97,500(1500 డాలర్లు) ఇవ్వనున్నారు.













