ట్రంప్ రాకతో డాలర్ డ్రీమ్ తుస్సే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలపై కఠినంగా వ్యవహరించడంతోపాటు, అమెరికన్లకే ఉద్యోగాలు లభించేలా చూస్తుండటంతో అమెరికాకు వెళ్ళి చదువుకుని ఉద్యోగం చేయాలన్న మన పిల్లల ఆశలు ఆడియాశలవుతున్నాయి.
విద్వేషపూర్వక దాడుల నేపథ్యంలో అమెరికన్ యూనివర్సిటీల్లో దరఖాస్తులు తగ్గిపోతున్నాయి. 250కి పైగా అమెరికన్ కాలేజీలో, ఆరు టాప్ అమెరికన్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రూప్స్‌లో భారతీయుల అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులు 26 శాతం పడిపోయినట్టు తాజా సర్వే వెల్లడించింది. గ్రాడ్యుయేట్ అప్లికేషన్లు కూడా 15 శాతం తగ్గినట్లు సర్వే పేర్కొంది. మొత్తంగా అంతర్జాతీయ విద్యార్థుల అప్లికేషన్లు కూడా సగటున 40 శాతం పడిపోయిన్నట్టు రిపోర్టులు వె ల్లడించాయి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజియేట్ రిజిస్ట్రార్లు అండ్ అడ్మినిషన్స్ ఆఫీసర్లు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్, ది నేషనల్స్ అసోసియేషన్ ఫర్ కాలేజీ అడ్మినిషన్ కౌన్సిలింగ్‌లు సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వె ల్లడయ్యాయి.
అమెరికా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్లో చైనా, భారత్ లు 47 శాతం ఉంటాయని దరఖాస్తు చేసుకుంటాయని, అమెరికాలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల్లో సగం శాతం మంది ఈ దేశాల విద్యార్థులే ఉంటారని సర్వే రిపోర్టు నివేదించింది. కానీ ఇటీవల నె లకొంటున్న పరిణామాలు అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల దరఖాస్తులను తగ్గించేసుకున్నాయని రిపోర్టు పేర్కొంది. చైనా నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అప్లికేషన్లు 25 శాతం, గ్రాడ్యుయేట్ స్టడీస్ అప్లికేషన్లు 32 శాతం పడిపోయినట్టు తెలిసింది. తాజా కార్యనిర్వాహఖ ఆదేశాలు ప్రస్తుత అప్లికెంట్స్, స్టూడెంట్లపై ప్రభావం చూపుతుందని, ఈ ప్రభావం భవిష్యత్తులో కూడా ఉంటుందని పోర్ట్ లాండ్ స్టేట్స్ ప్రెసిడెంట్ విమ్ వైవెల్ చె ప్పారు. ఈ ఏడాది పోర్ట్ లాండ్ యూనివర్సిటీలో 27 శాతం భారతీయుల విద్యార్థులు తగ్గిపోయారని పేర్కొన్నారు.













