బిడెన్‌ను ఓడించడానికి పనిచేస్తున్న రష్యా, ట్రంప్ ని ఓడించడానికి పనిచేస్తున్న చైనా,ఇరాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే అమెరికా దేశ ప్రజలే కాదు ప్రపంచం మొత్తం అగ్రరాజ్యానికి ఎవరు అధ్యక్షులు అవుతారు అని ఆసక్తి ని కనబరుస్తుంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఎక్కువగా కలిగి ఉన్న రష్యా , చైనా వంటి దేశాలు ఒక అడుగు ముందుకు వేసి వాళ్లకు నచ్చిన అధ్యక్షుడుని అమెరికా ప్రజలు ఎన్నుకునే లాగా అమెరికా ప్రజలని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అని కొత్త యు.ఎస్. ఇంటెలిజెన్స్ విశ్లేషణ అంచనా అని యుఎస్ఎ టుడే తెలిపింది.
కొత్త యు.ఎస్. ఇంటెలిజెన్స్ విశ్లేషణ అంచనా ప్రకారం డెమోక్రటిక్ ప్రెసిడెంట్ నామినీ జో బిడెన్‌ను అమెరికా ప్రజలు తిరస్కరించే విధంగా రష్యా చురుకుగా వారి ప్రణాళికలను అమలు చేస్తున్నారు అని తెలిసింది. అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను అనూహ్య వ్యక్తిగా చైనా భావిస్తూ తిరిగి ఎన్నికలలో గెలవకూడ చైనా వారి ప్రణాళికలను అమలు చేస్తున్నారు అని తెలిసింది మరియు నవంబర్ 2020 లో జరగనున్న ఎన్నికలకు ముందుగానే విభజనను ప్రోత్సహించడానికి మరియు అధ్యక్షులు ట్రంప్‌ను అణగదొక్కడానికి ఇరాన్ కృషి చేస్తోంది ఎందుకు అంటే అధ్యక్షులు ట్రంప్ తిరిగి ఎన్నిక కావడం వలన ఇరాన్‌పై యు.ఎస్ ఒత్తిడి కొనసాగుతుంది అని ఇరాన్ భావిస్తున్నట్లు శుక్రవారం 7th ఆగస్టు ప్రచురించిన నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ విశ్లేషణ తెలుపుతుంది అని యుఎస్ఎ టుడే తెలిపింది.
రష్యా అనుకూల ఉక్రేనియన్ పార్లమెంట సభ్యులు ఆండ్రి డెర్కాచ్ మాజీ ఉపాధ్యక్షులు బిడెన్ అభ్యర్థిత్వం మరియు డెమొక్రాటిక్ పార్టీ ని అణగదొక్కడానికి డెమొక్రాటిక్ పార్టీ పాలన అవినీతి పాలన గా ఫోన్ కాల్స్ లీక ద్వారా ప్రచారం చేస్తున్నట్లు మరియు కొంతమంది క్రెమ్లిన్‌తో సంబంధం ఉన్న నటులు సోషల్ మీడియా మరియు రష్యన్ టెలివిజన్లలో అధ్యక్షులు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
డెర్కాచ్ లీక చేసిన ఫోన్ కాల్లస్ సంభాషణలలో బిడెన్ మరియు మాజీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పెట్రో పోరోషెంకోల మధ్య మాజీ వైస్ ప్రెసిడెంట్ బిడెన్ తన కుమారుడి వ్యాపార లావాదేవీలను కాపాడటం కోసం బిడెన్ మాట్లాడిన మాటలు తన పై వ్యతిరేకత కలిగించే విధంగా ఉన్నాయి అని తెలిసింది. చైనాలో, అధికారులు అమెరికా లోని ప్రజలు అనుసరించే జీవన శైలి ద్వారా అధ్యక్షులు ట్రంప్ పై అమెరికా ఓటర్లకు వ్యతిరేకత వచ్చేలా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను విస్తరిస్తున్నారు. ఇందుకు చైనా హౌస్టన్ కాన్సులేట్ మూసేయడం, టిక్‌టాక్ మరియు వీచాట్ నిషేధం , కోవిద్ -19 వ్యాప్తికి చైనా కారణంగా ప్రపంచానికి చూపించడం వంటి చెరియలు కారణం అని విశ్లేషణ లో పేర్కొన్నట్టు తెలిసింది.













