భారతీయులకు శుభవార్త
మలేషియాకు వెళ్లాలని భావించే భారతీయులకు శుభవార్త. ఇకపై ఎటువంటి వీసాను తీసుకోకుండానే ఆ దేశానికి వెళ్లి రావచ్చు. ఇంతవరకూ ముందుగా వీసా తీసుకుని మాత్రమే మలేషియాకు వెళ్లే వీలుండగా, ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేస్తున్నట్టు మలేషియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇకపై ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని మలేషియాలో పర్యటించవచ్చని తెలిపింది. నేపాల్, శ్రీలంక తదితర దేశాలకు వెళ్లేలాగానే అక్కడికీ వెళ్లిరావచ్చని, ఈ మేరకు భారత పౌరులకు సరికొత్త సౌలభ్యాన్ని మలేషియా సర్కారు కల్పించిందని పేర్కొంది.













