భారీగా తగ్గిన హెచ్-1బీ వీసా దరఖాస్తులు
ఇండియన్ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా దరఖాస్తులను భారీగా తగ్గించినట్టు వెల్లడైంది. కేవలం కంపెనీలు మాత్రమే కాక విదేశీయులు సైతం అమెరికా కంపెనీలపై తక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ట్రంప్ కార్యాలయం చేపడుతున్న యాంటీ ఇమిగ్రేషన్ సిస్టమ్‌తో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని టాప్ సిలికాన్ వ్యాలీ న్యూస్‌పేపర్ పేర్కొంది. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ విషయంలో ట్రంప్ కార్యాలయం చాలా కఠినతరమైన ప్రక్రియను చేపడుతుందని శాన్ఫ్రాన్సిస్కో క్రోనికల్ ఎడిటోరియల్ బోర్డు పేర్కొంది. ఇటు ఇది దరఖాస్తులపైనా, అటు కంపెనీలపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో భారత కన్సల్టింగ్ సంస్థలు భారీగా హెచ్-1బీ వీసా ఫైలింగ్‌లను తగ్గించాయని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1 బీ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.













