ప్రధాని మోదీకి ధన్యవాదాలు : మెలానియా ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ సతీమణి మెలానియా ట్విటర్ వేదికగా స్పందించారు. భారత్ పర్యటన కోసం అధ్యక్షుడు ట్రంప్, తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. అహ్మదాబాద్, ఢిల్లీ లో పర్యటించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్, నేను సంతోషంగా ఎదురుచూస్తున్నాం. అమెరికా, భారత్ సత్సంబంధాన్ని వేడుకలా జరుపుకుందాం అని ఆమె ట్వీట్ చేశారు.













