భారత్‌తో ఇక చర్చల్లేవ్
భారత్‌తో చర్చలు జరపడంపై ఇక ఎటువంటి ఆసక్తి లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆర్టికల్ 370 నిర్వీర్యానికి ముందు, తర్వాత చర్చల కోసం తాను చేసిన ప్రయత్నాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన మరుసటి రోజు న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పై ఇమ్రాన్ తన అక్కసును బయటపెట్టారు. కాగా, అంతర్జాతీయంగా కశ్మీర్ అంశానికి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రవాస పాకిస్థానీలు సహకరించాలని ఒక సమావేవంలో ఇమ్రాన్ కోరారు. వచ్చే నెల న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే మోదీకి వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టాలని ఆదేశించారు.













