యుద్దం మొదలైతే నా చేతిలో ఉండదు… మోదీ చేతిలో ఉండదు
ఒక్కసారి యుద్ధమంటూ మొదలైతే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఒక్కసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గాని, భారత ప్రధాని మోదీ చేతుల్లో గానీ ఉండదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పాక్ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు భారత్కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. మా భూభాగంలోకి మీరు వచ్చారు.. మీ భూభాగంలోకి మేం వచ్చాం అని భారత వాయుసేన దాడి, అందుకు పాక్ ఇవాళ చేపట్టిన దాడులను ప్రస్తావించారు. పుల్వామా, ఇతర అంశాలపై భారత్తో తాము చర్చకు సిద్ధమని తెలిపారు.













