చైనా వైరస్ ను అంతం చేస్తాం : ట్రంప్
అమెరికా వైద్య శాస్త్ర పరిజ్ఞానశక్తితో చైనా వైరస్ను పూర్తిగా తుదముట్టిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు. కరోనా వైరస్ సోకిన ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. శ్వేతసౌధం సౌత్ లాన్లో రిపబ్లికన్ మద్దతుదారులను ఉద్దేశించి బ్లూ రూం బాల్కనీ నుంచే ప్రసంగించారు. బైడెన్ అధికారంలోకి వస్తే డెమొక్రాటిక్ పార్టీ అమెరికా సోషలిస్టు దేశంగా మారుస్తుందని ఆరోపించారు. నల్లజాతి, లాటిన్ అమెరికన్లకు ఆ పార్టీ వ్యతిరేకమన్నారు. డెమొక్రాట్లు అధికారంలో ఉన్న నాలుగు నగరాల్లో గత ఏడాది 1000 మందికిపైగా ఆఫ్రో అమెరికన్లు హత్యకు గురయ్యారని చెప్పారు.













