శశి అంత్యక్రియలకు వస్తున్న హనుమంతరావు
న్యూజెర్సీలోని బర్లింగ్టన్ లో సంచలనం రేపిన ఎన్ ఆర్ఐ శశికళ.. ఆమె కుమారుడి దారుణ హత్య ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శశికళను..ఆమెకుమారుడు అనీస్ సాయిలను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అయితే.. వీరి మరణాలకు భర్త నర్రా హనుమంతరావే కారణమని..అతడికి ఒక కేరళ మహిళకు మధ్యనున్న వివాహేతర సంబంధంతోనే భార్య.. కొడుకును హత్య చేసినట్లుగా శశికళ అత్తమామలు ఆరోపించారు. ఒక కేరళ మహిళతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందంటూ శశికళతన సోదరుడికి ఒక ఈమొయిల్ పంపారు. ఆతర్వాతే ఆమె హత్యకు గురి కావటం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా పోలీసులు మాత్రం శశికళ భర్తను విచారించి.. వారి హత్యలలో శశికళ భర్తకు సంబంధం లేదన్న ప్రాధమిక అభిప్రాయానికి వచ్చారు. ఆయనకీ హత్యలతో సంబంధం లేదనే బలమైన ఎలిబీని చూపిస్తున్నారని చెబుతున్నారు. తన భార్య.. కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ హనుమంతరావు పెట్టుకున్న దరఖాస్తుపై అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హనుమంతరావును అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతిస్తూ.. బర్లింగ్టన్ ప్రాసిక్యూటర్ అధికారప్రతినిధి జోయెల్ బెవ్లీ వెల్లడించారు.













