డా.బీనా చింతలూరికి హార్వర్డ్ వర్సిటీ ఆహ్వానం
ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్, తెలంగాణ జైళ్ల శాఖ మంత్రి ఉన్నతి కార్యక్రమ ఇన్చార్జి డా.బీనా చింతలూరికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందింది. ఖైదీల్లో మానసికంగా మార్పు తీసుకురావడంతో నేరాల శాతం తగ్గించడం అనే అంశంపై ఆమె ప్రసంగించనున్నారని తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక్కడి జైళ్లలో అమలవుతున్న సంస్కరణలు ఖండాంతరాలకు పాకుతున్నట్లు పేర్కొన్నారు. ఉన్నతి కార్యక్రమ ఇన్ఛార్జిగా ఉన్న బీనాకు ఆహ్వానం అందడమే దీనికి నిదర్శనమని వివరించారు.













