హెచ్-1బీ పై అమెరికా కొత్త విధానం
ఒకే సంస్థలో పని చేసే ఉద్యోగుల తరపున యాజమాన్యంగానీ, న్యాయ నిపుణులు గానీ ఉమ్మడిగా హెచ్1బీ వీసాల రిజిస్ట్రేషన్లను చేయవచ్చని, పిటిషన్లను వేయవచ్చని అమెరికా వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ఇందులో భాగంగా మైయూఎస్సీఐఎస్ సంస్థాగత ఖాతాల పేరుతో కొత్త సేవను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇందులో కంపెనీలు ఖాతా తెరవవచ్చని తెలిపింది. ఐ-907 ఫారం ద్వారా ముఖ్య మైన అర్హమైన దరఖాస్తులు, పిటిషన్ల కోసం ప్రాధాన్య సేవలు కావాలని కంపెనీ విజ్ఞప్తి చేయవచ్చని, ఈ దరఖాస్తులకు ఇమిగ్రేషన్ లబ్ధికలిగించాలా వద్దా అనే నిర్ణయాన్ని డీహెచ్ఎస్ తీసుకుంటుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. 2025 ఏడాది హెచ్ 1బీ వీసాల తొలి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మార్చి 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చేపట్టినట్లు అమెరికా వలస సేవల విభాగం వెల్లడిరచింది. నాన్ క్యాప్ హెచ్`1బీ వీసాల కోసం మార్చిలో ఐ`129, ఐ`907 ఫారాలను ఆన్లైన్లో నింపేందుకు అనుమతిస్తున్నామని, ఏప్రిల్ 1 నుంచి క్యాప్డ్ హెచ్`1బీ వీసాల రిజిస్ట్రేషన్లలో ఎంపికైన వారి పిటిషన్లను, ఐ`907 ఫారాలను స్వీకరిస్తామని తెలిపింది.







