ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మిచిగాన్ చాప్టర్ లాంచ్‌కి ఘనంగా ఏర్పాట్లు!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మిచిగాన్ రాష్ట్రంలో అధికారికంగా మిచిగాన్ చాప్టర్ లాంచ్(Michigan Chapter Launch) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్యూనిటీని ఒకతాటిపైకి తీసుకొచ్చి సేవ చేయడానికి ఇదొక చారిత్రక అడుగు అని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ తేదీ, వేదిక వివరాలు
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం 2026 అక్టోబర్ 11వ తేదీన జరగనుంది. ఉదయం 11:00 AM EST నుండి మధ్యాహ్నం 1:30 PM EST వరకు ఈ వేడుక కొనసాగుతుంది. మిచిగాన్‌లోని ఫార్మింగ్టన్ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఫార్మింగ్టన్ హిల్స్ మేనార్(Farmington Hills Manor, 23666 Orchard Lake Rd, Farmington Hills, MI 48337) ఈ వేడుకకు వేదికగా నిలవనుంది.
కమ్యూనిటీ బలోపేతమే లక్ష్యం…
మన సంప్రదాయం వెచ్చదనాన్ని, ఉత్సాహాన్ని మిచిగాన్ గడ్డపైకి తీసుకువస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. అందరం కలిసి చరిత్రాత్మక క్షణాలను సృష్టిస్తూ, మరింత బలమైన , పరస్పర సహకారంతో కూడిన భవిష్యత్తును నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.
ఈ చాప్టర్ లాంచ్‌ను విజయవంతం చేయడానికి మిచిగాన్ టీమ్ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. చాప్టర్ కోఆర్డినేటర్ శ్రీదేవి మనేపల్లి, చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ మాహి బొల్లావరం, ఈవెంట్స్ అండ్ లాజిస్టిక్స్ రవి చలంటి, ట్రెజరర్ హేమ సూరపరాజు, మెంబర్షిప్ జ్యోతి జవ్వాది, పీఆర్ అండ్ మీడియా అనుపమ దివాకర్ల తదితరులు ఈ బృందంలో సేవలందిస్తున్నారు. మిచిగాన్‌లోని తెలుగు ప్రజలందరూ ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలివచ్చి, నెట్వర్కింగ్, పరస్పర సహకార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నిర్వాహకులను సంప్రదించవచ్చని తెలిపారు.








