విమాన ప్రయాణికులకు శుభవార్త!
విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఎగురుతున్న విమానాల్లో కూడా వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవల్ని వినియోగించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు ఇంటర్నెట్ సేవల్ని ప్రయాణికులకు అందించేలా విమానయాన సంస్థలకు అనుమతిస్తూ పౌరవిమానయాన శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విమానం ఎగురుతున్న సమయంలో ఇంటర్నెట్ సేవల్ని వినియోగించుకునేలా ప్రయాణికులకు పైలట్-ఇన్-కమాండ్ అనుమతించొచ్చు. తద్వారా వైఫై సదుపాయంతో ల్యాప్‌ట్యాప్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, ఈ-రీడర్ వంటి డివైజ్‌లను ఫ్లైట్ మోడ్ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఇం•ర్నెట్ని వాడుకోవచ్చు అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.అయితే ఎయిర్‌క్రాఫ్ట్‌లో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవల్ని అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ధ్రువీకరించాల్సి ఉంటుందని సృష్టంచేసింది.













