అమెరికా ఒప్పందం నుంచి వైదొలగిన గూగుల్
అమెరికా సైన్యంతో గతంలో కుదుర్చుకున్న ఓ ఒప్పందం నుంచి వైదొలిగినట్టు గూగుల్ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కొంతకాలంగా గూగుల్ ఉద్యోగులు సంస్థ సీఈవోను అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగుల అభ్యర్థన మేరకు గూగుల్ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ మావెస్ అనే ప్రాజెక్టు కోసం అమెరికా సైన్యం గూగుల్‌తో జతకట్టింది. డ్రోన్లు తీసే వీడియోల్లో ఉన్నది మనుషులా లేక వస్తువులా అనేదాన్ని గుర్తించేందుకు మానవ ప్రమేయం లేకుండా కృత్రిమ మేధస్సును వాడటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యుద్ధ సంబంధ ప్రాజెక్టులను గూగుల్ చేపట్టకూడదంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మనుషులు, వస్తువుల మధ్య తేడాలను కృత్రిమ మేధస్సు గుర్తిస్తే, మావన ప్రవేమయం లేకుండా మనుషులను డ్రోన్లే యుద్ధంలో హతమార్చే రోజు రావొచ్చు. అది చాలా ప్రమాదకరం. దీనిపై అంతర్జాతీయంగా విస్తృత చర్చ జరగాల్సి ఉంది అని ఐసీఆర్ఏసీ అనే సంస్థ పేర్కొంది. ఉద్యోగుల నిరసనతో గూగుల్ దిగొచ్చింది.













