కరోనా పై గూగుల్ కీలక నిర్ణయం
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై అవగాహన కల్పించేందుకు తనదైన శైలిలో స్పందించింది. వైరస్‌నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమయ్యే సమాచారం కోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించిన వారం తర్వాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కరోనా వైరస్ కోసం గూగుల్ ఒక స్క్రీనింగ్ వెబ్సైట్ తీసుకోవాలనీ, తద్వారా ఇది ప్రజలను నిర్దేశించాలని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో www.google.com/covid19/ అనే వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ అవగాహన, నివారణ, స్థానిక వనరులపై ఈ వెబ్సైట్ దృష్టి కేంద్రీకరించింది. కోవిడ్-19 సమచారం రాష్ట్రాల ఆధారంగా, భద్రత, నివారణ మార్గాలతో పాటు కోవిడ్ సంబంధ సెర్చ్, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్ తెలిపింది. సెర్ఛ్ ఫలితాల్లో, గూగుల్ మ్యాప్స్‌లో నేరుగా కరోనా వైరస్ గురించి నమ్మదగిన సమాచారం అందేలా చేస్తామని సెర్చ్ దిగ్గజం తెలిపింది.













