యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే దాన్ని తొలగిస్తాం
నిరాధార వార్తలను అరికట్టడమే లక్ష్యంగా, ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్ చేయడాన్ని యూట్యూబ్‌లో నిషేధించనున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించారని గానీ, ఎన్నికల తేదీ వ్యవహారంలో తప్పుడు సమాచారం గానీ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే దాన్ని తొలగిస్తామని ఆ సంస్థ చెప్పింది. తాము నియమించిన ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌లు ఆయా వీడియోలను నిరంతరం పరిశీలిస్తుంటాయని చెప్పింది. వార్తలకు నమ్మదగిన స్థానం కలిగిన దానిగా యూట్యూబ్‌ను మార్చనున్నట్లు తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తున్నామని ట్విట్టర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.













