చైనాపై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరస్ విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ధ్యజమెత్తారు. ఇటీవలే తమ దేశంలో కరోనా కారణంగా మరణించిన వారిసంఖ్య పెరిగిందని చైనా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్ కరోనా మరణాల విషయంలో చైనా అబద్ధాలాడుతోందని ఆరోపించారు. అమెరికాలో ఇప్పటివరకు 37 వేల మంది కరోనా కారణంగా మరణించారు. చైనాలో అంతకన్నా ఎక్కువమందే మృతిచెందారు. కానీ చైనా ఈ విషయాన్ని దాచిపెడుతోంది అని ట్వీట్ చేశారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో కరోనా గురించి మాట్లాడుతూ ఈ కొత్త రకం వైరస్ చైనాలోని ల్యాబ్లో తయారయిందేమో పరిశోధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.













