అమెరికాలో మరోసారి కాల్పుల మోత
అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. చికాగో సమీపంలో జరిగిన వేర్వేరు కాల్పుల్లో ఓ గర్భిణి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చికాగోలోని సౌత్షోర్ ప్రాంతంలో గల రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడి పరారయ్యాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరిని సోదరులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ముందు రెస్టారెంట్‌కు సమీపంలోని ఓ ఇంట్లో కాల్పుల శబ్ధం వినిపించింది. పోలీసులు వెళ్లి చూసే సరికి ఓ నాలుగు నెలల గర్భిణి తలలో బులెట్ గాయంతో రక్తపు మడుగులో పడి కన్పించింది. గర్తుతెలియని వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.













