భార్యకు మద్దతుగా నిలిచిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ వేసుకున్న ఓ జాకెట్‌పై మీడియాలో విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు, భర్త డొనాల్డ్ ట్రంప్ ఆమెకు మద్దతుగా నిలిచారు. మెక్సికో సరిహద్దులోని వలసదారుల చిన్నారులను ఉంచిన శిబిరాన్ని సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆమె ఓ జాకెట్‌ను ధరించారు. దానిపై ఐ రియల్లీ డోంట్ కేర్, డూ యు? అని రాసి ఉంది. దీంతో విమర్శలు మొదలవ్వగా, డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఐ రియల్లీ డోట్ కేర్, డూ యు? రాసి ఉండటం మీడియా ఫేక్ న్యూస్ సృష్టిస్తుందని, కొన్ని సందర్భాల్లో ఆమె పట్టించుకొనేదని, వారి మోసపూరితనం గురించి మెలానియా తెలుకుంటున్నారని ట్వీట్ చేశారు. పర్యటన కోసం మెలానియా దుస్తుల ఎంపికపై విమర్శిస్తున్న ట్రంప్ మీడియాపై విరుచుకుపడ్డారు. అయితే, ఆమె టెక్సాస్‌కు వచ్చినప్డుపు జాకెట్‌ను ధరించలేదు.













