ఆ పేజీలను తొలగించడం లేదు : ఫేస్ బుక్
అమెరికాలో వచ్చే నవంబరు నెలలో రానున్న కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ తన వినియోగదారుల ఖాతాలనుండి పేజీలను రద్దు చేస్తోందని వస్తున్న ఆరోపణలను ఫేస్బుక్ ఖండించింది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో 13 మంది రష్యన్ పౌరులు, ఒక ఇంటర్నెట్ ఏజెన్సీ ఫేస్బుక్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేస్తాయన్న ఆరోపణలు వచ్చాయి. ఫేస్బుక్ అధినేత కూడా పార్లమెంటు కమిటీల ఎదుట సంజాయిషీ ఇచ్చారు. నవంబరులో రానున్న కాంగ్రెస్ ఎన్నికలలో ఫేస్బుక్ వినియోగదారులు తమ అకౌంట్ల ద్వారా దుర్వినియోగం పరచకుండా సమస్యాత్మకమైన పేజీలను నిలిపివేసిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ఆ ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇచ్చింది.













