మళ్లీ ఫేస్ బుక్కైంది
డేటా షేరింగ్ విషయంలో ఫేస్బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. కేంబ్రిడ్జి అనలిటికా ఉదంతంతో ఆపకీర్తిని మూటగట్టుకున్న ఫేస్బుక్, తాజాగా దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు, టాబ్లెట్ తయారీదారులతో తమ వినియోగదారుల సమాచారాన్ని పంచుకునే భాగస్వామ్యాన్ని కలిగి ఉందని న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. దశాబ్దకాలంగా ఫేస్బుక్ తన యూజర్ల డేటాను యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, బ్లాక్బెర్రీ వంటి 60 కంపెనీలకు షేర్ చేసిందని తెలిపింది. వినియోగదారులతో పాటు, వారి స్నేహితుల సమాచారాన్ని సేకరించేందుకు వీలు కల్పించినట్లు పేర్కొంది. ఈ చర్యను ఫేస్బుక్ సమర్థించుకుంది. ఎఫ్టీసీ, ప్రైవసీ పాలసీలకు అనుగుణంగానే తమ ఒప్పందం ఉందని సృష్టం చేసింది.













