ఫేస్‌బుక్‌ను వీడని కష్టాలు
గతేడాది సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ కుంభకోణాలు, డేటా తస్కరణ సమస్యల్లో చిక్కుకున్నది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆన్లైన్లో 4.9 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు, 41.9 కోట్ల వుంది ఫేస్బుక్ ఖాతాదారుల డేటా బేస్ బహిర్గతమైంది. అందులో తాజాగా 26,71,40,436 మంది ఫేస్బుక్ ఖాతాదారుల ఐడీలు, ఫోన్ నంబర్లు, పేర్లు ఆన్లైన్లో బహిరంగంగా లభ్యమవుతున్నాయని కంపారిటెక్ సంస్థ, భద్రతా పరిశోధకుడు బాబ్ డియాచెంకో సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. ఎటువంటి పాస్వర్డ్, ధ్రువీకరణ లేకుండానే ఇంటర్నెట్ నుంచి ఈ వివరాలు పొందొచ్చునని, దీన్ని స్పామ్ సందేశాలు, చౌర్యపరమైన దాడులకు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని చెప్పారు.













