లోపాలున్నాయని తెలిసి కూడా ‘ఫేస్ బుక్’ మోసం చేసింది
ఎలాగైనా సంస్థ వృద్ధి చెందాలి. దీనికోసం ఏం చేయడానికైనా రెడీ. లోపాలు ఉన్నాయని తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరించడం. ఇది ఫేస్బుక్ గురించి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ బయటపెట్టిన నిజాలు. 2016లోనే ఆయన ఈ విషయాలను బయటపెట్టారు. ఈ సోషల్ నెట్వర్క్ వల్ల ప్రతికూల పరిణామాలు ఉంటాయని తెలిసినా, ఫేస్బుక్ అవేమీ పట్టించుకోలేదని ఆండ్రూ బోస్వర్త్ చెప్పారు. ఏడాది కాలంగా ఫేస్బుక్లో ఉన్న లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. తప్పుడు సమచారాన్ని వ్యాప్తి చేయడం, హింసాత్మక వీడియోలు, జాతి వివక్ష యాడ్స్, తాజాగా ప్రైవసీకి సంబంధించిన అంశాలు ఫేస్బుక్ తలనొప్పిగా మారాయి. ప్రతిసారీ తప్పులను సరిదిద్దుకుంటామని చెప్పి తప్పించుకుంటున్నది. అయితే ఈ లోపాలన్నీఉన్నాయని ఫేస్‌బుక్‌కు ముందే తెలుసని బోస్వర్త్ రెండేళ్ల కిందట చెప్పారు.
దీర్ఘకాలిక లక్ష్యాలను అందుకోవాలంటే ఇలాంటి రిస్క్‌లను తీసుకోవాల్సిందేనని ఫేస్బుక్ బలంగా నమ్ముతుందని ఆయన తెలిపారు. అందుకే సంస్థ వృద్ధి కోసం చేసే ప్రతి పనిని సమర్థించుకోవాల్సి వస్తుందని అన్నారు. తాము చేసే పనులు కొన్ని సమాజంపై చెడు ప్రభావం చూపే అవకావం కూడా ఉంటుంది. ఫేస్బుక్ టూల్స్ సాయంతో ఉగ్రవాడులు జరిగే ప్రమాదం కూడా ఉంది. ఎవరినైనా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంటుంది అని బోస్వర్త్ చెప్పారు. అయితే రెండేళ్ల కిందట రాసిన ఆ లేఖలో అంశాలతో ఇప్పుడు బోస్వర్త్ విభేదిస్తున్నారు.













