తానా నూతన కార్యవర్గానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు
తానా నూతన కార్యవర్గానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన తానా ఎన్నికల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన నరేన్ కొడాలికి, బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి లకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిప్రాయభేదాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని తెలుగుభాష, సంస్కృతి కోసం తానా చేస్తున్న సేవలు మరింత విస్తృతం చేయాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని, అందరు కలిసిమెలిసి ఐకమత్యంతో మెలిగి తెలుగు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని తెలిపారు.







