రూ.3,755 ఖర్చుకు…రూ.50 లక్షలు లాభం
దుబాయ్‌కు వలస వచ్చి నివాసముంటున్న రీమా అల్ హల్వానీ అనే మహిళకు బంపర్ ఫ్రైజ్ తగిలింది. తన పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కోవాలని చూసే సమయంలోనే ఆమెకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే ఖరీదైన ఇన్ఫినిట్ క్యూ30 కారు లాటరీలో తగిలింది. దీంతో రీమా ఆనందానికి అవధుల్లేవు. దుబాయ్ సమ్మర్ సర్ప్రైజెస్ (డీఎస్ఎస్) ఈ లాటరీని ప్రకటించింది. దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఎఫ్ఆర్ఈ), దుబాయ్ షాపింగ్ మాల్స్ గ్రూప్ (డీఎస్ఎమజీ) ఈ లాటరనీ నిర్వహిస్తూ వస్తోంది.
200 దిర్హామ్‌లు పెట్టి ఈ లాటరీని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రతి వారం ఒక విజేతను ఎంపిక చేసి వారికి ఇన్ఫినిటీ క్యూ30 కారును బహుమతిగా ప్రకటిస్తారు. తన జీవితంలో గెలిచిన మొదటి బహుమతి ఇదేనని రీమా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. పాత కారు అమ్మిన వెంటనే ఇలా కొత్త కారు బహుమతిగా రావడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని చెప్పింది. ఈ బహుమతిని ఇచ్చిన డీఎస్ఎస్కు ధన్యవాదాలు తెలిపింది.













