TTA: టీటీఏ వేడుకల ఛైర్మన్ గా డాక్టర్ డీఎల్ నరసింహారెడ్డి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో తన పదవ వార్షికోత్సవ వేడుకలను టిటిఎ ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అట్టహాసంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు డా. నరసింహ రెడ్డి దొంతిరెడ్డి (ఎల్‌ఎన్ రెడ్డి)ని ఛైర్మన్‌గా నియమించారు. ఆయన గతంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు. టిటిఎ అటు అమెరికాలోనూ ఇటు తెలంగాణలోనూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కమ్యూనిటీకోసం చేపట్టి అమలుచేసింది.







