ప్రతిభ ఉన్నవారు మా దేశానికి రండి
ప్రతిభ ఉన్నవారు తమ దేశానికి రావాలనే ఉద్దేశాన్ని అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బయటపెట్టారు. యూఎస్ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని కోరారు. అక్రమ వలసదారులు దేశానికి పెను ముప్పుగా ఆయన పేర్కొన్నారు. అమెరికన్ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. మా చట్టాలను గౌరవిస్తూ నేడు లక్షల మంది వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు. న్యాపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలనే నేను కోరుకుంటున్నాను. కానీ న్యాయపరంగా రావాలని అన్నారు.













