అంచనా వేసిన దానికంటే తక్కువగానే : ట్రంప్
అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ముందుగా అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశముందని, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కోవిడ్-19 కారణంగా మంగళవారం నాటికి అమెరికాలో సుమారు 12,700 మంది ప్రాణాలు కోల్పోగా, సోమవారం నుంచి మంగళవారం వరకూ మాత్రమే 1,900 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అత్యధికంగా నాలుగు లక్షలకు చేరుకుంటూండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే 5,400 మంది మరణించారు. 1.38 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. న్యూజెర్సీలో 1,200 మంది ప్రాణాలు కోల్పోగా, 44,416 మంది కోవిడ్ కోరల్లో చిక్కుకున్నారు.













