షటౌడౌన్ ముగిసిన తర్వాతే ప్రసంగిస్తా
అమెరికాలో షట్‌డౌన్ ముగిసిన తర్వాతే కాంగ్రెస్‌లోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తానని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన వార్షిక కార్యక్రమమైన స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (డెమోక్రాట్) యూఎస్‌లో కాంగ్రెస్‌లో ట్రంప్ వార్షిక ప్రసంగానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. షట్‌డౌన్ కొనసాగుతున్నందున ప్రసంగాన్ని వాయిదా వేసుకోవాలని పెలోసీ తెలిపారు. దీంతో ట్రంప్ షటౌడౌన్ ముగిసే వరకు వేచి ఉంటానని చెప్పారు.
షౌట్డౌన్ కొనసాగుతుండగా స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్ చేయమని నాన్సీ పెలోసీ కోరారు. నేనూ అంగీకరించాను. కానీ షట్‌డౌన్ కారణంగా ఆమె మనసు మార్చుకున్నారు. ప్రసంగాన్ని మరో తేదికి మార్చుకోవాలని సూచించారు అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికాలో షట్‌డౌన్ ముగిసిన తర్వాతే ప్రసంగిస్తానని సృష్టం చేశారు.













