పాక్ తీరుపై ట్రంప్ అసంతృప్తి
ఉగ్రవాదంతో పాకిస్థాన్ సాగిస్తున్న పోరాటం తగిన స్థాయిలో లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొదటిసారి ఈ విషయంలో పాకిస్థాన్‌ను జవాబుదారీ చేస్తూ వైట్‌హౌస్ ప్రకటన చేసింది. డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ రాజ్ షా ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) సమావేశం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించే దేశాలపై అంతర్జాతీయ నిఘా జాబితాలో పాకిస్థాన్‌ను చేర్చుతున్నట్లు షా తెలిపారు. ఉగ్ర సంస్థలపై చర్యల విషయంలో పాక్ కొంత మెరుగుదల చూపినా అది సరిపోదని ఆయన అన్నారు. పాక్ అందించిన వివరాలతో ట్రంప్ సంతృప్తి చెందలేదని షా ప్రకటించారు.













