ఆ రెండు దేశాల భేటీకి ప్రపంచ దేశాలు ఆసక్తి
సింగపూర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మధ్య జూన్ 12న జరగబోయే భేటీ కోసం ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రెండు దేశాల మధ్య జరగబోయే సమావేశంలో ఏఏ అంశాలపై చర్చ జరుగుతుందన్న చర్చ మొదలైన నేపథ్యంలో ఉత్తరకొరియా, అమెరికా అధికారులు ఏర్పాట్లపై చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే ఉత్తరకొరియా వెళ్లి ఆదేశ నాయకులతో చర్చలు జరిపిన అమెరికా అధికారులు కీలకాంశాలపై చర్చించారు. తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడికి కుడిభుజంగా పేర్కొనే జనరల్ కిమ్ యాంగ్ చోల్ అమెరికా వెళ్లారు.













