సుందర్ పిచాయ్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ప్రశంసలు కురిపించారు. గూగుల్‌పై గతంలో విమర్శలు కురిపించిన ట్రంప్ తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. పిచాయ్ అమెరికా సైన్యం కోసం పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పిచాయ్ పూర్తిగా అమెరికా వైపు దృఢంగా నిలబడ్డారంటూ ట్వీట్ చేశారు. పిచాయ్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమైన అనంతరం ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం విశేషం. అలాగే దేశం కోసం గూగుల్ ఏమేమి చేయగలదన్న అంశాలపై కూడా పిచాయ్‌తో చర్చించానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. సంచలన వ్యాఖ్యలతో టెక్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచే ట్రంప్ ఈసారి గూగుల్ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు. అంతేగాకుండా, గతంలో టిమ్ యాపిల్ అని సంబోధించిన అమెరికా ప్రెసిడెంట్, ఈసారి సుందర్ పిచాయ్‌ను ప్రెసిడెంట్ ఆఫ్ గూగుల్ అని తప్పుగా సంబోధించి మరోసారి చర్చకు తావిచ్చారు. మరోవైపు తాజా పరిణామంపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.













