బారెట్ నామినేషన్ కు డెమోక్రాట్లు షాక్
సుప్రీంకోర్టు జడ్జిగా అమీకోన్ బారెట్ నామినేషన్‌పై జరగనున్న సెనెట్ జ్యుడిషియరీ ఓట్లలో డెమోక్రాట్ల కమిటీ ఓటును బహిష్కరిస్తున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. బారెట్ నియామకాన్ని ధ్రువీకరించడం చర్య మొదటి నుంచి మోసగించే చర్య అనిసెనెట్ మైనారిటీ నేత చార్లెస్ పేర్కొన్నారు. మరో పన్నెండు రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఈ నామినేషన్ కమిటీ మార్కప్‌లో పాల్గొనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ పక్రియకు చట్టబద్ధను కల్పించలేమని అన్నారు. కాగా, డెమోక్రాట్లు బహిష్కరించినప్పటికీ రిపబ్లికను బారెట్ నామినేషన్‌పై తుది నిర్ధారణకు ఓటుకు మార్గం సుగమం చేసేందుకు ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారని ది హిల్ నివేదించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాదర్ గిన్స్బర్గ్ మరణించడంతో అమె స్థానంలో సెప్టెంబర్ 26న బారెట్‌ను ట్రంప్ ఎంపిక చేసిన విషయం విదితమే.













