అమెరికాలో పార్శిల్ బాంబుల కలకలం
అమెరికాలో పార్శిల్ బాంబుల కలకలం కొనసాగుతోంది. మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, హాలీవుడ్ నటులు రాబర్ట్ డీనిరో తాజా లక్ష్యాలుగా మారారు. వీరిద్దరికీ ఉద్దేశించి అనుమానాస్పద పార్శిళ్లు, గొట్టం బాంబులను గుర్తించారు. డెలావేర్‌లోని బిడెన్ చిరునామా, న్యూయార్క్‌లోని డీ నిరో చిరునామాను ఉద్దేశించి రెండు గొట్టంబాంబులను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సంస్థలు తెలిపారు. తపాలా తనిఖీల్లో హిల్లరీని ఉద్దేశించిన కవర్‌ను గుర్తించారు. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్లకు పంపిన పార్శిళ్ల తరహాలోనే ఇవి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడిచారు. మొత్తంగా ఈ తరహా పార్శిళ్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. అన్నీ డెమోక్రటిక్ పార్టీ నేతల్ని లక్ష్యంగా చేసుకొని పంపినవే కావడం గమనర్హాం. సదరు బాంబుల్ని సురక్షితంగా నిర్వీర్యం చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు. అమెరికా పోస్టల్ సర్వీస్ విభాగం పరిశీలనలో పలు అనుమానాస్పద పార్శిళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది.













