అమెరికాలో తెలుగు వ్యక్తికి మరణశిక్ష
అమెరికాలో ఫస్ట్‌టైమ్ ఓ తెలుగు వ్యక్తికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. డబ్బుల కోసం ఓ చిన్నారిని, ఆమె అమ్మమ్మను చంపిన రఘునందన్‌కి పైకోర్టు కూడా మరణశిక్షణే ఖరారు చేసింది. కిందికోర్టు ఇచ్చిన తీర్పును నిందితుడు పైకోర్టులో అప్పీల్ చేశారు. అక్కడ కూడా నెలల తరబడి విచారణ జరిగింది. చివరికి ఆ న్యాయస్థానం కూడా రఘునంద్కి మరణశిక్ష సరైనదని తేల్చింది. అమెరికాలో ఓ తెలుగువాడికి మరణశిక్ష పడడం ఇదే తొలిసారి. మరణశిక్ష ఎప్పుడనే తేదీని ఇంకా ప్రకటించలేదు.
మరణశిక్ష అమలయ్యాకే తన కూతురి, తల్లి ఆత్మకు శాంతి కలుగుతుందని వెంకట్ ఫ్యామిలీ చెప్పింది. కూతురు, తల్లిని కోల్పోయి తామెలా బతుకుతున్నామో ఇప్పటీకీ అర్థంకావట్లేదన్నాడు. ఈ ఘటన 2012లో జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట్ ఫ్యామిలీ పెన్సిల్వేనియాలోని ఓ అపార్ట్మెంట్లో వుంటున్నారు. వెంకట్, అతని భార్య లత ఇద్దరు ఉద్యోగం చేస్తుండడంతో పాపను చూసేందుకు తల్లి సత్యవతిని అమెరికాకి తీసుకెళ్లారు. వీరితో క్లోజ్‌గా వుండే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్కీ రఘునందన్‌కు, చెడు అలవాట్లకు బానిసై అక్రమ పద్దతిలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. అందుకు వెంకట్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వెంకట్, అతని భార్య డ్యూటీకి వెళ్లాక ఇంట్లో సత్యవతి చిన్నారి శాన్వితో గడిపేది. ఓ రోజు రఘునందన్ తులపు కొట్టడంతో ఓపెన్ చేసింది సత్యవతి. శాన్విని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని చూశాడు. పాపని ఎత్తుకుంటే సత్యవతి అడ్డుపడింది. ఆమెని కత్తితో పొడిచి హత్య చేశాడు. రఘునందన్. పాప్ ఎత్తుకెళ్లి నోటికి ప్లాస్టర్ వేసి ఓ సూట్ కేసులో పెట్టాడు. ఊపిరాడక చిన్నారి చనిపోయింది. ఇంట్లో దొరికిన ఆధారాలతో రఘునందన్ నిందితుడని తేల్చారు. పోలీసులు చివరకు అరెస్టు చేసి న్యాయస్థానానికి అప్పగించారు. 2014లో న్యాయస్థానం ఇలాంటి నిందితుడ్ని విషపు ఇంజెక్షన్‌తో చంపాలని ఆదేశించిన విషయం తెలిసిందే.













