CO2 లో అమెరికా తర్వాత మనమే
వాతావరణంలోకి విచ్చలవిడిగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు మన కొంప ముంచుతున్నాయి. ముఖ్యంగా కార్బన్ డై ఆక్సైడ్ (సీవోటూ) పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చడంతో పాటు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తున్నది. మన దేశంలో కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల వల్ల ఏటా జరుగుతున్న నష్టం ఎంతో తెలుసా. ఏకంగా రూ.15.25 లక్షల కోట్లు(210 బిలియన్ డాలర్లు). ఇది 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మన దేశ బడ్జెట్లో దాదాపు 75 శాతం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో తేలిన కఠోర వాస్తవమిది. కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు కలిగి ఆర్థికంగా నష్టపోతున్న దేశాల జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉండగా భారత్ రెండోస్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది.













