సినారెకు చికాగో సాహితీమిత్రుల నివాళి
చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ కవి, ఙానపీఠ్ పురస్కార గ్రహీత దివంగత సి. నారాయణరెడ్డికి చికాగో సాహితీ మిత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. దాదాపు 60 మంది సాహితీ మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెట్టుపల్లి జయదేవ్ తొలుత కార్యక్రమాన్ని ప్రారంభించి సినారె శిష్యురాలు డా. దామరాజు లక్ష్మీని వేదికపై ఆహ్వానించి అందరికీ పరిచయం చేశారు. ఆమె తన ప్రసంగంలో డా. సినారె వ్యక్తిత్వంపై ప్రసంగించారు. ఎస్.వి. రామారావు, డా. శారదా పూర్ణ సొంటి, రమానాథ్ కందాళ, విశ్వనాథ్ రెడ్డి బొల్లవరం, పుప్పాల శ్యాంమోహన్, జగదీష్ కానూరు, డా. రవీంద్రనాథ్ రెడ్డి, కమల చిమట, మురళి నందుల తదితరులు సినారెతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.













