చికాగో లో కోవిడ్ 19 సంక్షోభం లో తెలుగు వారి సహాయం
అమెరికా లో పలు నగరాలలో కోవిడ్-19 సంక్షోభం వలన దాదాపు కర్ఫ్యూ పరిస్థితి నెలకొని వుంది. ఈ స్థితి లో అనేక మంది… ముఖ్యం గా సీనియర్ సిటిజెన్ లు బయటకు రాలేక, నిత్యావసర సరుకులు, మందులు తెచ్చుకోలేక చాల ఇబ్బంది పడుతున్నారు చికాగో ఇండియన్ కమ్యూనిటీ తరుపున శ్రీమతి చాందిని దువ్వూరి మరి కొందరు తెలుగు వారు ముందుకు వచ్చి ఒక వాలంటీర్ కమిటీ గా ఏర్పడి అవసరమైన వారికి సహాయం చెయ్యటానికి ఉన్నామని తెలిపారు.
ఈ కమిటీ లో వాలంటీర్ గా పని చెయ్యటానికి కూడా ఆసక్తి వున్నవారు ముందుకు రావాలని ఆర్గనైజర్స్ కోరుతున్నారు.













