CAA: ఘనంగా చికాగో ఆంధ్ర సంఘం (CAA) దశాబ్ది ఉత్సవాలు
CAA: చికాగో ఆంధ్ర సంఘం (CAA) ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా 2016-2026 దశాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక , సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు:
1. శ్రీ సీతారామ కళ్యాణోత్సవం:
- తేదీ: ఏప్రిల్ 11, శనివారం
- సమయం: ఉదయం 9 గంటలకు
- వేదిక: శ్రీ బాలాజీ టెంపుల్, సుబ్బయ్య హాల్, అరోరా (Aurora, IL)
2. CAA దశాబ్ది వేడుకలు (Decennial Year Celebrations):
- తేదీ: ఏప్రిల్ 12, ఆదివారం
- సమయం: మధ్యాహ్నం 1:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు
- వేదిక: బోలింగ్బ్రూక్ హైస్కూల్, 365 రైడర్ వే, బోలింగ్బ్రూక్ (Bolingbrook, IL)
కళ్యాణం , దశాబ్ది వేడుకల కోసం విడివిడిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం www.chicagoandhra.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.
నిర్వాహక వర్గం (కార్యవర్గ సభ్యులు):
ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు ఈ క్రింది సభ్యులు కృషి చేస్తున్నారు.
- ప్రెసిడెంట్: తమిశ్ర కొంచాడ (630-449-2939)
- వైస్ ప్రెసిడెంట్: రామకృష్ణ తాడేపల్లి (630-991-6412)
- సెక్రటరీ: నరసింహ రెడ్డి ఒగ్గు (201-917-0337)
- కల్చరల్ చైర్మన్: శైలజ సప్ప (331-454-2833)
- కల్చరల్ కో-చైర్మన్: స్వర్ణలత నీలపు (312-860-6760)
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిగే ఈ వేడుకల్లో తెలుగువారందరూ పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








