Chandrababu: ఇద్దరు ఎన్ ఆర్ ఐ ల సేవలకు చంద్రబాబు గుర్తింపు

న్యూయార్క్ వాసి బుచ్చి రామ్ ప్రసాద్ (Buchi Ram Prasad) కు బ్రాహ్మణ కార్పొరేషన్
ఫిలడెల్ఫియా వాసి రవి మందలపు (Ravi Mandalapu) కు సైన్స్ & టెక్నాలజీ
2024 ఎన్నికల్లో ఎన్ ఆర్ ఐ లు, ముఖ్యంగా అమెరికా ఎన్ ఆర్ ఐ లు చాలా శ్రమపడ్డారు అని, తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టడం లో వారి పాత్ర చాలా ప్రధానమైనది అన్న విషయం అందరికి తెలిసిందే !! అమెరికా నుంచి వచ్చిన డా. చంద్ర పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలవడమే కాకుండా, కేంద్ర మంత్రి అయిన విషయం కూడా తెలిసిందే!
ఈ రోజు (12 ఆగస్టు 2025) న ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు (Chandrababu) నాయుడు గారు మరొక విడతగా 31 నామినేటెడ్ పోస్ట్స్ ప్రకటించారు. అందులో ఇద్దరు అమెరికా ఎన్ ఆర్ ఐ లకు చోటు దక్కడం అమెరికా తెలుగు కమ్యూనిటీ కి సంతోషకరమైన వార్త గా చెప్పాలి.
శ్రీ బుచ్చి రాంప్రసాద్ న్యూయార్క్ రాష్ట్రంలో ఫార్మా రంగంలో బిజినెస్ చేసుకుంటూ అమెరికా తెలుగు వారికి సుపరిచితులు. ఈ విషయమైనా సూటిగా మాట్లాడే శ్రీ బుచ్చ్హి రామ్ ప్రసాద్ తెలుగు దేశం పార్టీ విధి విధానాలు, శ్రీ చంద్ర బాబు, శ్రీ లోకేష్ ల నాయకత్వ పటిమ కు ఆకర్షితులై , అమెరికా వదిలి ఆంధ్ర ప్రదేశ్ లో క్రియాశీల రాజకీయాలలో గత 10 సంవత్సరాలుగా ప్రత్యక్షం గా పాల్గొంటున్న వ్యక్తి. ఈ రోజు శ్రీ చంద్రబాబు ఆయనను ఆంధ్ర రాష్ట్రం లోని బ్రాహ్మణ కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమించారు. శ్రీ బుచ్చి రాంప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ పని తీరుపై, బ్రాహ్మణులకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల పై గత ప్రభుత్వానికి అనేకసార్లు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ పదవి అన్ని విధాల న్యాయం చేస్తారని ఆశించవచ్చు. శ్రీ బుచ్చి రాంప్రసాద్ కు అభినందనలు.
శ్రీ రవి మందలపు ఫిలడెల్ఫియా లో ఉంటూ ఇట్ రంగంలోనే కాక ఇతర రంగాలలో కూడా విజయవంతంగా బిజినెస్ చేసే సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్. తానా సంస్థ లో అనేక పదవులు నిర్వహిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం లో, తన సహాయం అందించడం లో ముందుండే వ్యక్తి. శ్రీ రవి మందలపు గత 10-15 సంవత్సరాలు గా టీడీపీ పార్టీ కి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి తన మద్దతు తెలుపుతూ వున్నారు. 2024 లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ చంద్రబాబు గారు శ్రీ రవి మందలపు సేవలను గుర్తించి సైన్స్ & టెక్నాలజీ అకాడమీ కి చైర్మన్ గా నియమించారు. అమెరికా లోనే కాక మరికొన్ని దేశాల్లో తన బిజినెస్ ను విజయవంతం గా నిర్వహిస్తున్న శ్రీ రవి మందలపు ఆంధ్ర రాష్ట్రం లో సైన్స్ & టెక్నాలజీ అకాడమీ ని అద్భుతం గా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం శ్రీ రవి మందలపు కు అభినందనలు.