అమెరికాలో 3 కోట్ల ఉద్యోగాలు హుష్
అమెరికాలో నిరుద్యోగం పెరుగుతోంది. గత వారంలో దేశ వ్యాప్తంగా మూడు కోట్ల 84 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బ్యూరో ఆఫ్ లేట్ స్టాటిస్టిక్స్ (బిఎల్ఎస్) ఏప్రిల్ 30న ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు సంస్థలు మూతపడటంతో ఇప్పటి వరకు మూడు కోట్లకుపైగా ఉద్యోగాలు ఊడిపోయాయి. గడిచిన రెండు వారాల్లో నిరుద్యోగులపై చేపట్టిన సర్వేలో, వివిధ రాష్ట్రాల నుండి వేతన భృతిని పొందాలనుకున్న వారిలో 40 శాతం మంది ఓవర్లోడ్ అవ్వడం వల్ల వాటిని అందుకోలేకపోయారు. బిఎల్ఎస్ గణాంకాల ప్రకారం దరఖాస్తుదారుల సంఖ్య కాలానుగుణంగా మారుతూ వస్తోంది. ఏప్రిల్ 25తో ముగిసిన వారంలో నిరుద్యోగ భృతి కోసం 3.49 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.













