ఉద్యోగులకు బీఎండబ్ల్యూ షాక్
కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న జర్మన్ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. వార్షిక టర్నోవర్తో పాటు కొత్త కార్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో 6 వేల మంది ఉద్యోగులను ముందస్తు పదవీ విరమణపై త్వరలో ఇంటికి పంపనున్నట్టు వెల్లడించింది. ఈ విషయమై ఇప్పటికే తమ ఉద్యోగ సంఘాలతో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్టు సృష్టం చేసింది. మరోవైపు డీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్గా విక్రమ్ పవా నియమితులయ్యారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ గ్రూప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న పవా ఆగస్టు 1 నుంచి ఈ అదనంగా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.













