డల్లాస్ లో బ్లడ్ డ్రైవ్-లైఫ్ సేవింగ్
డల్లాస్ లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో కార్టటర్ బ్లడ్ కేర్, వైబ్రంట్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ కమ్యూనిటీ బ్లడ్ డ్రైవ్-లైఫ్ సేవింగ్ పేరిట రక్తదాన శిబిరం నిర్వహించింది. రెండు వందల మంది రక్తం ఇచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. సమయాభావంతో వంద మంది రక్త దానం చేశారు. గత మూడు సంవత్సరాలుగా టిపిఎడి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. గతేడాది ఇచ్చిన రక్తంతో 78 మందికి ఉపయోగపడిందని ప్రతినిధులు తెలిపారు. టీపీఎడి అధ్యక్షుడు కరణ్ పోరెడ్డి, కార్యదర్శి రమణ లష్కర్లు తెలిపారు. ఈ యేడాది మే13న వనభోజనాలు, జూలై 8న ఫుడ్ డ్రైవ్, సెప్టెంబరు 23న బతుకమ్మ, దసరా సంబరాలు, నవంబరు 11న శ్యాం ఎ మెహ్ ఫిల్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఛైర్ పర్సన్ ఉపేంద్ర తెలుగు, వైస్ ఛైర్ మహేందర్ కామిరెడ్డి, అజయ్‌రెడ్డి, రావు కాల్వల, రఘువీర్ బండారు, జానకీరాం మందడి, రాజవర్ధన్ గొంది, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ అశోక్ కొండల, మనోహర్ కోసగనీ మాధవి సుంకిరెడ్డి, రాం అన్నడి, గంగా దేవర, పవన్ గంగాదర, ప్రవీణ్బిల్లా, రాజేందర్ తోడిగల, ఇంద్రాణి పంచర్పుల, ఎగ్జీక్యూటీవ్ టీం చంద్రపోలిస్, లింగారెడ్డి అల్వా, రవికాంత్ మామిడి, శ్రీనివాస్ వేముల, శ్రీనిదర, సత్యపెర్కరీ, సతీష్ జనుంపల్లి, సురేందర్ చింతల, రోజ అదెపు, రూప కన్యాగారి, శరత్ ఎర్రం, టీపీఎడి సహాదారులు వేణు భాగ్యనగర్, విక్రం జనగాం, నరేష్ సుంకిరెడ్డి, రవిశంకర్ పటేల్, జయ తెలకలపల్లి, సంతోష్ కోరె, అరవింద్ ముప్పిడి, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగిల్ల, తదితరులు పాల్గొన్నారు.













