శాండర్స్ మద్దతుదారులకు బిడెన్ వరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ తనకు మద్దతుగా రేసు నుండి తప్పుకున్న బెర్నీ శాండర్స్ మద్దతుదారులకు కొన్ని వరాలు ప్రకటించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆరోగ్యబీమా ప్రయోజనాల అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తానని, విద్యా రుణ భారం నుంచి విముక్తి కల్పిస్తానని తన బ్లాగ్లో వెల్లడించారు. అందరికీ ఆరోగ్య బీమా అంటూ శాండర్స్ చేసిన ప్రతిపాదనను తను అమలు చేస్తానని ప్రకటించారు. దీనితో పాటు విద్యార్థులపై పెరిగి పోతున్న విద్యారుణభారాన్ని తగ్గించి వారికి ఉపశమనం కలిగిస్తానన్నారు. తన ఆలోచనలకు మార్గం సుగమం చేసిన శాండర్స్, ఆయన మద్దతుదారులకు బిడెన్ కృతజ్ఞతలు తెలియచేశారు.













